పులి కాదు బెబ్బులి... లేపొద్దు... చేతకాకపోతే నావద్దకు రండి... కేసీఆర్

బుధవారం, 4 మే 2016 (18:35 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ నేతలపై మండిపడ్డారు. పడుకున్న పులిని లేపి గొడవ పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. పులిని లేపితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అన్నారు. గోదావరి నీళ్లను ఎలా వాడుకోవాలో తెలియకపోతే మీకు నేను చెప్తాను రండి అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. 
 
తెలివిలేనితనంతో నీళ్లను వాడుకోలేక తెలంగాణ మీద పడుతారెందుకు అంటూ మండిపడ్డారు. తెలంగాణ గురించి మాట్లాడే ఆ ఇద్దరు ఆంధ్ర నేతల గురించి తనకు బాగా తెలుసుననీ, ఎక్కువ మాట్లాడి నాటకలాడి మర్యాద పోగొట్టుకోవద్దంటూ హెచ్చరించారు. నీటిని ఉపయోగించుకోవడం తెలియక దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూడొద్దు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని అనుకోవద్దంటూ హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాలతో తగాదాలు పెట్టుకోవాలని తెలంగాణ కోరుకోవడం లేదు. కానీ, చిల్లర చేష్టలు చేస్తే మాత్రం సహించేది లేదని అన్నారు.

వెబ్దునియా పై చదవండి