సీఎం కేసీఆర్‌కు కరోనా.. భావోద్వేగానికి గురైన ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్

మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (10:42 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా కోరలకు చిక్కారు. ఈ వార్త రాజకీయ వర్గాల్లో షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు.

సీఎం కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని కవిత తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
సీఎం కేసీఆర్‌ కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలున్నాయని కేటీఆర్ తెలిపారు. అందరి ప్రార్ధనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై‌ కూడా ట్వీట్ చేశారు.

ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి రావాలంటూ పలువురు ట్వీట్లు, సందేశాలు పంపారు. వీరితో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు.. తదితరులు కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు