యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:02 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. 
 
అక్కడ చివరి దశలో ఉన్న పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రకటిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌స్వామి ఖరారు చేశారు. ఆ వివరాలను సీఎం తెలియజేస్తారు. 
 
సీఎం కేసీఆర్ రాకను పురస్కరించుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. కాగా, ఈ ఆలయాన్ని రెండో తిరుపతిగా సీఎం కేసీఆర్ ప్రకటించి, ఆ మేరకు ఆలయ పునర్నిర్మాణ పనులు చేయిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు