ఈ సందర్భంగా కొంతమంది పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే పత్రికలు టీవీ చానెల్స్ ప్రతినిధులు, ఫార్టీనాయకుల పేర్లను పిసిసి ఎస్పీజీ పంపించింది. అయితే ఎస్పీజీకి పంపిన జాబితాలో జానారెడ్డి, షబ్బీర్ ఆలీ పేర్లు లేకపోవడంతో అలిగి ఇద్దరూ ప్లాజా నుంచి బయటికి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు.
ఇది గమనించిన మరో నేత ఇద్దరినీ బతిమాలి లోపలికి తీసుకొచ్చి కూర్చో పెట్టారు. లోపల కూడా వాళ్లిద్దరూ మౌనంగానే కూచున్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో సీనియర్ల మీటింగ్ జరిగే సమయంలో రేవంత్ రెడ్డి లోపలికి వెళ్లకుండా అనుమతి నిరాకరించారు. ఇక రాహుల్‌తో సీనియర్ల మీటింగ్‌కు తనకు కూడా అనుమతి లేదనడంతో సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం.