వీలైనంత త్వరగా నిమజ్జనాన్ని పూర్తిచేస్తాం : డీజీపీ మహేందర్ రెడ్డి

ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (13:55 IST)
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గణేష విగ్రహాల నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా డీజీపీ మహేందర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నాం. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారితో పర్యవేక్షిస్తున్నాం. పోలీస్‌ స్టేషన్లకు సీసీ టీవీ కెమెరాలు అనుసంధానం చేశాం. వీలైనంత త్వరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని డీజీపీ చెప్పారు. 
 
మరోవైపు, ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఇటీవ‌ల ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌జ్జ‌నార్‌.. ఆర్టీసీలో త‌న మార్క్ చూపిస్తున్నారు. మొన్న ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచిన స‌జ్జ‌నార్‌.. గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.
 
గ‌ణేశ్ విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం చేసేందుకు స‌జ్జ‌నార్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆర్టీసీ బ‌స్సులో బ‌య‌ల్దేరారు. స‌జ్జ‌నార్ తెలుపు రంగు వ‌స్త్రాల‌ను ధ‌రించారు. త‌ల‌కు తెలుపు రంగు టోపీ ధ‌రించిన ఆర్టీసీ ఎండీ.. త‌న చేతుల్లో గ‌ణేశ్ ప్ర‌తిమ‌ను ఉంచి, భ‌క్తిభావాన్ని చాటుకున్నారు. గ‌ణ‌ప‌తి బొప్పా మోరియా నినాదాల‌తో, డ‌ప్పు ద‌రువుల‌తో బ‌స్సు ద‌ద్ద‌రిల్లిపోయింది. ఆ బ‌స్సులో ఉన్న భ‌క్తులు కూడా హుషారుగా డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు