తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికలు ఇవి. తొలి ఎన్నికల్లో తెరాస విజయబావుటా ఎగురవేసింది. ఇపుడు మరో యేడాది అధికారం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సై అంది. ఇపుడు కేసీఆర్‌తోపాటు ఆయన పార్టీని చిత్తుగా ఓడించాలన్న గట్టిపట్టుదలతో విపక్ష పార్టీలన్నీ ఉన్నాయి. ఇందుకోసం మహాకూటమిగా ఏర్పడి ముందుకుసాగుతున్నాయి.
నిజానికి గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌తో పవన్ ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కేసీఆర్‌కు అండగా నిలిచి తెరాస అభ్యర్థులకు మద్దతునిస్తారని పెక్కుమంది భావిస్తున్నారు. అయితే, పవన్ మాత్రం తన నిర్ణయాన్ని ఈనెల 17వ తేదీన వెల్లడించనున్నారు.
కాగా, ఉన్నఫళంగా తెలంగాణకు అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడం, తగినంత సమయం లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ బలంగా లేకపోవడం వంటి పలు కారణాల కారణంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. కానీ, వచ్చే యేడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రం నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దించనున్నారు.