సెప్టెంబరు 9, 10, 11, 14వ తేదీ మధ్యలో ఎంసెట్ పరీక్షలు?

సోమవారం, 10 ఆగస్టు 2020 (20:06 IST)
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కోవిడ్ అంటేనే జడుసుకుంటున్నారు. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన అన్ని పోటీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 9, 10, 11, 14వ తేదీ మధ్యలో ఎంసెట్ పోటీ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అలాగే ఆగస్టు 31న ఈసెట్, సెప్టెంబరు 2న పాలిసెట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. 
 
కాలేజీల రీఓపెన్ గురించి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... సెప్టెంబరు 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్లు చేపడతాం. ఆగస్టు 17 నుంచి సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. 'హైకోర్టు నుంచి అనుమతి వస్తే ఎంట్రెన్సు పరీక్షలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు