తెలంగాణలో సర్కార్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

శనివారం, 25 డిశెంబరు 2021 (20:18 IST)
New year
దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వైరస్ ముప్పు ప్రస్తుతం భారత్‌ను తాకింది. ఊహించిన దానికంటే ఎక్కువగానే కేసులు నమోదవుతుండటంతో కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. తాజాగా ఓమిక్రాన్ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఉత్తర్వుల ఆదేశాలతోనే ఆంక్షలు విధించిన సర్కార్.. జనాలు ఎక్కువ ఉన్నచోట్ల థర్మల్ స్కానింగ్, మాస్క్ తప్పనిసరి చేసింది. 
 
క్రిస్మస్ నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు తెలంగాణ సర్కారు తెలిపింది. పబ్లిక్ ఈవెంట్లలో భౌతిక దూరాన్ని తప్పనిసరి చేసింది. ఓమిక్రాన్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కార్ సూచిస్తోంది. 
 
డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. మాస్కులు పెట్టుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఢిల్లీ, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఓడిశా, హర్యానా రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా వాటి జాబితాలో చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు