కరోనా కాటుకు గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ కుమార్తె మృతి

సోమవారం, 10 మే 2021 (10:35 IST)
Bhavani
కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ కూతురు ఆవుల భవాని (29) కరోనాతో మరణించారు. వారం రోజుల పాటు ఆమె కరోనాతో పోరాడారు. 
 
గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి మృతి చెందారు. ఆమెకు భర్త కార్తీక్, 15 రోజుల బాబు ఉన్నాడు. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆదివారం దేవర కరుణాకర్‌కు పంపిన ఒక సందేశంలో సంతాపం వ్యక్తం చేశారు. 
 
ఇటువంటి క్లిష్ట సమయంలో నిబ్బరంగా ఉండాలని ఆయన దేవర కరుణాకర్‌ను కోరారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌లోని హిందూశ్మశాన వాటికలో జరిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు