ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఓకే చెప్పింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిట్ విచారిస్తుంది. అయితే, సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతుందని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణ పారదర్శకంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సీబీఐ విచారణకు ఆదేశించవద్దంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.