MLAల సస్పెన్షన్‌పై హైకోర్టు ఆదేశాలు

బుధవారం, 9 మార్చి 2022 (18:12 IST)
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. గ‌వ‌ర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించడంపై నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌లపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. 
 
అయితే, దీనిపై న్యాయపోరాటానికి దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు.. తమ సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు.. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తెలంగాణ అసెంబ్లీ కార్యద‌ర్శికి నోటీసులు జారీ చేసింది.
 
రాజ్యాంగ విరుద్ధంగా తమను సస్పెండ్‌ చేశారంటూ రాజాసింగ్‌, రఘునందన్‌, రాజేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు.

అయితే, అసెంబ్లీ వ్యవ‌హారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదంటూ కోర్టును కోరారు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్. ఇరు వ‌ర్గాల వాద‌న‌ల‌ను విన్న కోర్టు.. అసెంబ్లీ కార్యద‌ర్శికి నోటీసులు జారీ చేస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను రేపటికి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు