ఆసుపత్రులు, మెడికల్ షాపులు, అత్యవసరాల దుకాణాలు తప్ప మిగితా షాపులు ఏవీ రాత్రి 9.30 గంటల తర్వాత తీసి ఉంచడానికి వీలు లేదు. అత్యవసర సేవలకు సంబంధించిన వారికి మాత్రమే బస్సులు, రైళ్లు, విమానల ద్వారా ప్రయాణానికి అనుమతి ఉంటుంది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 945 పాజిటివ్ కేసులు వచ్చాయి. వాటిలో 869 కేసులను జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చెల్ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. ఇవాళ్టి కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి పెరిగింది.
తాజాగా 1,712 మందిని డిశ్చార్జి చేయడం విశేషం అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఒకేరోజు ఇంతమంది డిశ్చార్జి అయిన దాఖలాలు లేవు. యాక్టివ్ కేసుల సంఖ్య 8,785. తాజాగా ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 260కి చేరింది.