లాక్‌డౌన్‌తోపాటు వర్షపాతం, వానాకాలం సాగు, గోదావరి నుంచి ఎత్తిపోతలు, జల విద్యుత్తు ఉత్పత్తి తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకూ లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.
అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, పాజిటివిటీ రేటు 1.36శాతంగా నమోదు కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఈ మేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేసి రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు సమాచారం. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పార్కులను సైతం తెరిచే అవకాశం ఉంది. అయితే, అంతర్రాష్ట్ర బస్సులను మాత్రం ఇప్పట్లో అనుమతించరాదని ప్రభుత్వం భావిస్తోంది.