గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో యూఎన్ డబ్ల్యూటివో సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.
ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా లోని భూదాన్ పోచంపల్లికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశంలోనే తొలిసారి భూదానోద్యమం ప్రారంభం అయ్యింది ఈ గ్రామం నుంచే. అప్పటి వరకు మాములు పోచంపల్లిగా పిలువబడే ఈ గ్రామం భూదాన్ పోచంపల్లి గా ప్రసిద్దికెక్కింది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.