కేసీఆర్ నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మహా కూటమిపై మండిపడ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ వ్యాఖ్యలపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పందిస్తూ… తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పు పడుతున్నారు. మరి.. 2009లో తెలుగుదేశం పార్టీతో తెరాస పొత్తు పెట్టుకోలేదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేసారని ఆరోపించారు.
ప్రగతిభవన్ లో కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతుంది అన్నారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలుపలేదా..? ప‌్రజాధనం ప్రతి ఒక్కరికీ అందించాలనే మహా కూటమికి శ్రీకారం చుట్టాం అని చెప్పారు. కొంగరకలాన్ సభతో కేసీఆర్ డీలాపడ్డారు. అవినీతి బయటపడుతుంది కనుక కేసీఆర్ బూతులు మాట్లాడుతున్నారు. ఆయన బూతులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు. నరేంద్ర మోడీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా అవేవీ ఫలించవు అనీ… కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఎప్పుడూ ఆశపడలేదని చెప్పారు.