రాష్ట్రంలో దున్నపోతు లాంటి ప్రభుత్వం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రివర్యులు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు.
కానీ మందులు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్ మాత్రం ఇది 50 పడకల ఆసుపత్రి మాత్రమేనని ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నారని ఆయన మీడియాకు వివరించారు. ఈ ఆస్పత్రిపై వైద్య ఆరోగ్యశాఖకు, డ్రగ్ కంట్రోల్ శాఖకు మధ్య సమాన్యవయం లేదనేందుకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తే.. ఇప్పటివరకు ఎక్విప్ మెంట్ కూడా రాష్ట్రప్రభుత్వం ఈ ఆరేళ్లలో సమకూర్చలేదని మండిపడ్డారు. ఏం.ఆర్.ఐ, ఈసీజీ లేదని అన్నారు. బ్లడ్ సేపరేటర్, డయాలసిస్ సెంటర్ కూడా లేదని అన్నారు.
డాక్టర్లు ఎక్కడ?
ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పదిమంది సివిల్ సర్జన్లు ఉండాల్సిఉండగా ఒక్కరు కూడా లేరని, అలాగే ఏడుగురు డిప్యూటీ సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరు లేరని, అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 27 మంది ఉండాల్సి ఉండగా.. 11 పోస్టులు ఖాలీ ఉన్నాయని అన్నారు.