చదువుకుంటూనే వ్యవసాయం చేస్తోంది ఓ యువతి. అంతేకాదు గొప్పలక్ష్యంతో ముందుకు సాగుతూ.. ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. రమ్యది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రుని పేట సొంతూరు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో పీఈటీ కోర్సు చదువుతోంది. స్కూల్ చదివేప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండేది.