చిక్కుల్లో టీఆర్ఎస్ నేత.. కిరోసిన్ డబ్బాతో దళిత యువతి ధర్నా

శనివారం, 10 అక్టోబరు 2020 (16:59 IST)
ఓ టీఆర్ఎస్ నేత చిక్కుల్లో చిక్కుకున్నారు. భూమి విక్రయంలో టీఆర్ఎస్ నేత ఆయిల్ అంజయ్యపై ఆరోపణలు వచ్చాయి. నగరంలోని అంబర్‌పేట్ అలీ కేఫ్ న్యూ అంబేద్కర్ నగర్‌కు చెందిన దళిత మహిళ జగదీశ్వరి ధర్నాకు దిగారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఇంటిముందు కిరోసిన్ డబ్బా పట్టుకొని ధర్నాకు దిగారు. తన తల్లి కష్టపడి సంపాదించిన ఇంటిని ఇతరులకు అమ్మడానికి ప్రయత్నిస్తున్న అంజయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని జగదీశ్వరి వాపోయారు. పోలీసులు తన ఫిర్యాదును తీసుకోవట్లేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు కూడా టీఆర్ఎస్‌ నేతకే వంత పాడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయకుంటే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని జగదీశ్వరి చెబుతున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు