తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) గుట్టుచప్పుడుకాకుండా ప్రయాణ చార్జీలను ధరలు పెంచేసింది. ఇప్పటికే రౌండప్ పేరుతో చార్జీలను ఆర్టీసీ సంస్థ బస్సు చార్జీలు పెంచేసింది. ఇపుడు మరోమారు చార్జీలను పెంచేసింది. ప్యాసింజర్ సెస్ పేరిట మరోమారు చార్జీలను పెంచేసింది. అదేసమయంలో బస్ పాస్‌ల రేట్లను కూడా పెంచుతున్నట్టుగా ఆర్టీసీ సోమవారం ప్రకటించింది. పెంచిన బస్ పాస్ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
పెరిగిన బస్ పాస్ ధరలను ఓసారి పరిశీలిస్తే, ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.970గా ఉండగా దీన్ని రూ.1150కు పెంచేసింది. అలాగే, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ధరను రూ.1070 నుంచి రూ.1300 వరకు పెంచింది.
డీలక్స్ బస్ పాస్ ధర రూ.1185 నుంచి రూ.1450 వరకు పెంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ ధరలను రూ.1100 నుంచి రూ.1350కి గుట్టుచప్పుడు కాకుండా పెంచేసింది. ఇకపోతే, పుష్పక్ ఏసీ బస్ పాస్ ధరను రూ.2500 నుంచి రూ.3000కు పెంచేసింది.