సైబర్ క్రైం పోలీసులకు అందిన సమాచారం మేరకు... పాతబస్తీకి చెందిన ఓ వివాహిత భర్తతో విభేదాల కారణంగా తల్లిదండ్రుల వద్దే గత నాలుగు నెలలుగా ఉంటోంది. ఆ వివాహిత ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఆమెకు స్నేహితురాలిగా ఉన్న మరొక యువతి సహాయం తీసుకున్నారు.
తమ వీధిలో ఒక పుట్టినరోజు వేడుక జరుగుతుండగా ఆ వేడుకకి ఆ యువతిని రప్పించారు. ఆమె భోజనం చేసిన తర్వాత జ్యూస్ తాగుతుండగా ఆ యువతి చీరపై ఆమె స్నేహితురాలు కూల్ డ్రింక్ పోసింది. ఆ తర్వాత అరెరే... దుస్తులపై జ్యూస్ పడింది... బట్టలు మార్చుకో అంటూ ఒక గదిలోకి తీసుకెళ్ళింది. అప్పటికే ఆ ఇద్దరు యువకులు ఆ గదిలో ఒకచోట నక్కి వున్నారు. యువతి చీర మార్చుకుంటున్న దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియో ఫోటోలను మరుసటి రోజు ఆమె మొబైల్‌కు, ఆమె సోదరుడు మొబైల్‌కు పంపారు. దీంతో బాధితురాలు, ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.