ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు.. ఈ ఏడాది శుభాలే అధికం

శనివారం, 2 ఏప్రియల్ 2022 (12:01 IST)
తెలంగాణ ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ సర్కారు నిర్వహించిన ఈ ఉగాది వేడుకల్లో మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వేదపండితులు సీఎం కేసీఆర్‌ని ఆశీర్వదించారు.
 
పంచాంగ పఠనం ప్రారంభించిన బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి కొత్త సంవత్సరం ఎలా వుండబోతోంది అనేది వివరించారు. వేములవాడ రాజన్న ప్రభ మళ్ళీ వెలుగబోతుందన్నారు. ఈ సంవత్సరం ఎక్కువ మంచి జరగబోతుంది. ఫ్రాన్స్, రష్యాలలో అలజడి, రియల్ ఎస్టేట్ రంగం ఒక్క హైదరాబాద్ లోనే బాగుంటుంది. 
 
హైదరాబాద్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుందన్నారు. రైలు, ప్రకృతి, అగ్ని ప్రమాదాలు అక్కడక్కడ దేశంలో జరుగుతాయి. అయితే తెలంగాణకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిపాలన అందిస్తారు. పంటలు అద్భుతంగా పండబోతున్నాయి. రైతులే రాజులు కాబోతున్నారు. ప్రజల ఆరోగ్యానికి ఢోకా లేదని ఇక మాస్కులు కూడా అక్కర్లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు