తెలంగాణలో ఈ నెల 12 రాబోయేది కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాఫ్రంట్ ప్రభుత్వమే అనీ, తెలంగాణలో ఓటింగ్ సరళి, ఓటర్ల ఉత్సహం చూసినప్పుడు అర్థమవుతోందని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తను డిసెంబరు 12 లేదా 13న గడ్డం తీయబోతున్నానని వెల్లడించారు.
బీజేపీ - టీఆర్ఎస్ నేతలు ఓటమి భయంతో తమ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
కల్వకుర్తిలో దాడి జరిగిన వంశీకి మా మద్దతు వుందని అన్నారు. కాగా తాజాగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్‌లో తెరాస గెలుస్తుందని స్పష్టం అవుతోంది.
తెరాస 85 సీట్లు, ప్రజా కూటమికి 25, భాజపాకి 1, ఎంఐఎం పార్టీకి 7 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ చెపుతోంది. ఈ నేపధ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ... ఆయన గడ్డం కాదు.. ఏకంగా గుండు గీయించుకోవాల్సిందే అంటున్నారు తెరాస నాయకులు. ఏం జరుగుతుందో ఈ నెల 11 వరకూ ఆగి చూడాల్సిందే.