తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా జలుబు, దగ్గు జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. వీటికి తోడు కాళ్లు, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలు మారుమూల గ్రామాల్లో, తండాలతో పాటు పట్టణాల్లో సైతం ఎక్కువగా నమోదవుతున్నాయి.
విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జ్వరాల బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలరోజుల వ్యవధిలో 42 మంది మృతి చెందడంతో ప్రజలు హడలిపోతున్నారు.