'కలెక్టర్' ఓవరాక్షన్... ఆమ్రపాలి "నవ్వుల"పాలు (వీడియో)

శనివారం, 27 జనవరి 2018 (10:20 IST)
ఆమె ఓ ఐఏఎస్ అధికారి. సాక్షాత్తు జిల్లా పరిపాలనాధికారి. గణతంత్ర వేడుకల్లో జెండా వందం చేశాక ఆమె చేసే ప్రసంగం జిల్లా అభివృద్ధి ప్రణాళికకు అద్దం పట్టాలి. సంవత్సరం పాటు సాధించిన  ప్రగతి గణాంకాల పట్టం కట్టాలి. ఇదంతా ఎంతో హుందాగా.. అందంగా సాగాల్సిన కార్యక్రమం. 
 
కానీ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి గణతంత్ర వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగం మాత్రం అలా కాకుండా హాస్యాస్పదంగా సాగింది. ఫలితంగా ఆమె నవ్వులపాలైంది. పైగా, ఆమె వ్యవహరించిన తీరు జిల్లాలో చర్చనీయాంశమైంది. 
 
ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా నవ్వడం... గణాంకాల దగ్గర తడబడటం... మధ్యలో ఇట్స్‌ఫన్నీ అని వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ ఆమ్రపాలి జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత తెలుగులో రాసిన ప్రసంగ పాఠాన్ని చదువుతూ ఆమె అనేక సార్లు తడబడ్డారు.
 
ఆమె అసందర్భంగా నవ్వడం… ప్రసంగం మధ్యలోనే వెటకారాలు చేయడం… వెనుకకు తిరిగి చూడడం… మధ్యలో నీళ్లు తాగడం…'ఇట్స్ ఫన్నీ' అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఆమె స్పీచ్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. 
 
మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినపుడు ఏకంగా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తనలోతాను 'ఇట్స్ ఫన్నీ' అని వ్యాఖ్యానించడం.. అదంతా మైకుల ద్వారా ప్రసారం కావడంతోపాటు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా చక్కర్లు కొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆవీడియోను మీరూ ఓసారి చూడండి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు