ఉప ఎన్నికతో ఉపయోగం ఉందా... అందుకే హుజురాబాద్ పోటీకి దూరం : వైఎస్ షర్మిల

శనివారం, 17 జులై 2021 (16:38 IST)
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ప్రకటించారు. ఇదే అంశంపై ఆమె శనివారం ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటన చేశారు.
 
హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించారు. ఈ ఉపఎన్నిక వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? అని అడిగారు. 
 
దళితులకు మూడెకరాల భూమి వస్తుందా? అని ప్రశ్నించారు. ఇవన్నీ చేస్తామని ప్రభుత్వం చెపితే తాము కూడా పోటీ చేస్తామని చెప్పారు. పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలే హుజూరాబాద్ ఉపఎన్నికలని ఆమె అభిప్రాయపడ్డారు. 

 

• హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా?
• హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయం
• నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా?
• దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా?
• ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం
• హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే. pic.twitter.com/w5VfIArIJv

— YS Sharmila (@realyssharmila) July 17, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు