కమిషనర్‌ని ఆపిన కానిస్టేబుల్.. రూ. 500 బహుమానం

శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (15:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. 
 
ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలలో భాగంగా ఎల్బీనగర్‌లోని పరీక్షా కేంద్రాన్ని డీఎస్ చౌహాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ చౌహాన్ పరీక్షా కేంద్రానికి వెళ్తూ వెళ్తూ చేతిలో ఫోన్ పట్టుకెళ్లారు. 
 
ఈ సమయంలో అక్కడ విధుల్లో వున్న మహిళా కానిస్టేబుల్ సీపీని ఆపారు. సీపీ వద్ద వున్న ఫోన్‌ను ఇవ్వాలని.. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. 
 
దీంతో సీపీ తన చేతిలోని ఫోన్‌ను అప్పగించారు. అంతేగాకుండా.. మహిళా కానిస్టేబుల్ చిత్తశుద్ధి, ఆమె విధుల పట్ల అంకితభావాన్ని గుర్తించి, సీపీ చౌహాన్ ఆమెను సత్కరించారు. తరువాత, అధికారి కల్పన కృషిని మెచ్చుకొని ఆమెకు రూ. 500 బహుమానం అందించారు.
 
తన మునుపటి ఆదేశాలపై, పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతించేది లేదని, పరీక్షా కేంద్రాలలో ఎటువంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు