అంతర్జాతీయ చిత్రోత్సవాలకు మంచు మనోజ్‌ చిత్రం!

శనివారం, 10 మార్చి 2012 (19:40 IST)
WD
ఏమిటీ! ఆశ్చర్యంగా ఉందా? అంతేలే తెలుగు సినిమాల బోర్డరే దాటడంలేదు... అంతర్జాతీయ స్థాయి ఏమిటి? అని కంగారు పడకండి. మంచు మనోజ్‌ బాలకృష్ణతో కలిసి నటిస్తున్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'.

ఈ చిత్రంలో బాలయ్యతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని మనోజ్‌ చెప్పారు. బాలకృష్ణగారు మాకంటే చిన్నపిల్లవాడు. ఆయన అంతగా అల్లరి చేసి సరదాగా కలిసిపోతాం. ఆయన నేను కలిసి చేసిన సన్నివేశాలు, కొన్ని యాక్షన్‌ సీన్స్‌ అదుర్స్‌. అంతర్జాతీయ చిత్రోత్సవానికి కూడా ఈ సినిమా పంపాలని ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే.. చరిత్రలో నిలిచిపోయే చిత్రమవుతుందని అన్నారు. చూద్దాం... ఎంత చరిత్ర చేస్తుందో...

వెబ్దునియా పై చదవండి