గంగపుత్రుల కథా నేపథ్యంలో రూపుదిద్దుకునే "సంద్రం"

WD
సముద్రాన్ని నమ్ముకుని జీవించే జాలర్ల జీవితాలపై ఆధారంగా 'సంద్రం' అనే చిత్రం నిర్మాణమవుతోంది. షూటింగ్‌ పూర్తయి ఈ చిత్రం లోగో ఆవిష్కరణ గురువారంనాడు జరిగింది. కుమార్‌ రాజు దర్శకత్వంలో రాజేష్‌ తెన్నేటి నిర్మిస్తున్నారు. సీనియర్‌ జర్నలిస్టు బి.ఎ.రాజు లోగోను ఆవిష్కరించారు.

అనంతరం ఈ చిత్రంలో పాటలు పాడిన శ్రీలేఖ పుట్టినరోజు కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం బి.ఎ.రాజు మాట్లాడుతూ, ఇందులో నాగు రాసిన పాటలు బాగున్నాయి. ప్రతి పాత్రా డెప్త్‌గా ఉంది. మా అన్నయ్యగారి అబ్బాయి దుర్గా కిషోర్‌ పొటోగ్రఫీ అందించారు. చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

శ్రీలేఖ మాట్లాడుతూ, ఈసినిమాలో మూడు పాటలు పాడాను. చాలా ఫీల్‌ ఉన్న పాటలవి. నాగులో మంచి టాలెంట్‌ ఉంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు క్రిష్‌ చక్కటి సంగీతాన్ని అందించారు. లోగో చాలా వైవిధ్యంగా ఉంది. సినిమా కూడా అలానే ఉంటుందన్నారు.

హీరో అర్జున్‌ మాట్లాడుతూ, ఇంతకుముందు చిన్న చిన్న పాత్రలు వేసేవాడిని. హీరోగా అవకావం కల్పించిననిర్మాత దర్శకులకు రుణపడి ఉంటానన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, సంద్రం అనేది వికృతి శబ్దం. ఈసినిమాలో మానవ సంబంధాలుంటాయి. దాన్ని అందరికీ తెలియజేయాలనే ఈ సినిమా తీశాం. మాటలుకూడా నేనే రాశాను. నిర్మాత ఎంతో సహకరించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుందని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ, మాదితొలిప్రయత్నం. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను సినిమాను విడుదలచేయనున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి