రామయ్యలో మార్పులేదు... సెప్టెంబర్ 27న ఖాయం!

బుధవారం, 7 ఆగస్టు 2013 (16:57 IST)
FILE
ఓ పక్క సీమాంధ్రాలో ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ధియేటర్లు అన్నీ క్లోజ్ చేసేశారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాకుండా వాయిదా వేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' మాత్రం వెనుకడుగు వేసేదిలేదని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు.

తన దర్శకత్వంలో రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం విడుదలలో ఏ మాత్రం మార్పూ లేదని స్పష్టంగా చెబుతున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. మొదట్లో ప్రకటించినట్టుగానే ఇది సెప్టెంబర్ 27న విడుదలవడం ఖాయమని ఆయన తాజాగా ట్వీట్ చేశాడు.

ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ చిత్రానికీ, 'ఎవడు' చిత్రానికీ కూడా నిర్మాత దిల్ రాజే. ముందుగా ఆయన 'ఎవడు' చిత్రాన్ని రిలీజ్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తాడు. దానికే ఇంతవరకు దిక్కు లేదు. సీమాంధ్రలో ప్రశాంత వాతావరణం ఎప్పటికి ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. మరి, ఇవేమీ పట్టించుకోకుండా హరీష్ శంకర్ 'రామయ్య' రిలీజ్ గురించి ఎలా చెబుతున్నాడో అతనికే తెలియాలి!

వెబ్దునియా పై చదవండి