'అరుంధతి' బాలనటి దివ్య హీరోయిన్‌గా, నందు హీరోగా నటిస్తున్న చిత్రం 'నేను నాన్న అబద్ధం'. గోవింద్ వరహా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె. నాగిరెడ్డి సమర్పణలో శ్రీ రాజేశ్వర సోమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై బాలప్రకాష్, కె.ఎన్.తిలక్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కృష్ణుడు ప్రధాన పాత్ర పోషిస్తుండగా విలన్‌గా 'ప్రకాశ్ భరద్వాజ్' పరిచయం అవుతున్నాడు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభోత్సవం జరుపుకొని సింగిల్ షెడ్యూల్‌లో భాగంగా వైజాగ్ పరిసర ప్రాంతాలైన తుని, అన్నవరం రైల్వేస్టేషన్, సూరవరం, మంగాపురం బీచ్, పాయకరావుపేట తదితర అందమైన ప్రదేశాల్లో హీరో, హీరోయిన్, విలన్ ప్రకాష్ భరద్వాజ్ మరియు కృష్ణుడులపై కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా గోవింద్ వరహా మాట్లాడుతూ...'ఇప్పటి వరకు 40శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ని రాకేష్ మాస్టర్ ఆధ్వర్యంలో 30మంది డ్యాన్సర్స్ 150 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో 4రోజుల పాటు భారీగా చిత్రీకరించాము' అన్నారు.
నిర్మాతలు బాలప్రకాష్, పి.ఎన్.తిలక్‌లు మాట్లాడుతూ...'కోస్తా తీరంలో శరవేగంగా జరుపుకుంటున్న మా చిత్రం కోసం అన్ని కమర్షియల్ హంగులు ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక భారీ సెట్‌లో 'సోనాలీ జోషి' మీద ఐటెంసాంగ్‌ని చిత్రీకరిస్తున్నాము.
ఈ పాట యూత్‌ని ఎంతో ఆకట్టుకుంటుంది. ఇందులో నటిస్తున్న హీరో, హీరోయిన్లు, కృష్ణుడు, విలన్‌గా పరిచయం అవుతున్న ప్రకాష్ భరద్వాజ్ వీరంతా అద్భుతంగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వారి అందరికీ మంచి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తున్నాను'అన్నారు.