సింధు మీనన్ లండన్ లో భర్తతో హాయిగా ఉంది... నో సూసైడ్ ఎటెంప్ట్

మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (14:28 IST)
WD
హీరోయిన్ సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. సింధు ఆత్మహత్యాయత్నం చేయలేదని ఆ వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు.

సింధు తెలుగులో చందమామ, వైశాలి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కాగా, సినిమాలకు స్వస్తి చెప్పిన తర్వాత సింధు పెళ్ళి చేసుకుని బ్రిటన్ వెళ్ళిపోయింది.

ప్రస్తుతం సింధు మీనన్ పూర్తి ఆరోగ్యంగా ఉందని, భర్తతో ఆనందంగా కాపురం చేసుకుంటోందని సింధు మీనన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి