అనుష్కను వదిలేశారు.. అసిన్‌ను ఆడిస్తున్నారు..!

శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (18:20 IST)
మలయాళీ ముద్దుగుమ్మ అసిన్ అనవసరంగా సమస్యల్లో చిక్కుకుంది. తనకు మాలిన పనిలో జోక్యం చేసుకుంటే తలనొప్పులు తప్పవన్న విషయం అమ్మడికి అవగతమైంది. ఇటీవల క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో ఇండియా పరాజయం పాలైన సందర్భంలో విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔటైన తీరుపై అభిమానులు అతని ప్రియురాలు అనుష్క శర్మపై విరుచుకుపడిన సంగతి మనకు తెలిసిందే.
 
దీంతో, 'ఈ విషయంలో అనుష్క తప్పేముంది?' అంటూ అసిన్ ఆమెకు మద్దతు పలికింది. దీంతో క్రికెట్ అభిమానులు అనుష్కను వదిలేసి, అసిన్ పై పడ్డారు. ఆమె పేరిట నకిలీ అకౌంటును ప్రారంభించి రకరకాలుగా ట్వీటులు వదులుతున్నారు. విషయం కాస్తా అసిన్ దృష్టికి వెళ్ళడంతో అమ్మడు తలపట్టుకుని పోలీసులను ఆశ్రయించే ఆలోచన పడింది.

వెబ్దునియా పై చదవండి