నాకు యాక్సిడెంట్ జరిగిందని ఎవరు పుట్టించారు... నేను బాగానే వున్నా: ఆదాశర్మ

బుధవారం, 27 మే 2015 (14:10 IST)
ఆదాశర్మకు షూటింగ్‌లో ఓ బస్‌ ఢీకొందనీ, ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చేరిందని వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో వచ్చిన ఈ వార్తకు ఆదాశర్మ ట్విట్టర్‌లో సమాధానం చెప్పింది. తనకు ఏ ప్రమాదమూ జరగలేదని, చాలా బాగున్నానని చెప్పింది. పుకార్లను నమ్మవద్దని ఏదైనా వుంటే నేను ట్వీట్‌ చేస్తానని అంది. గత కొంతకాలంగా హీరోయిన్లకు ఏదో జరిగిందంటూ రకరకాలుగా వస్తున్న వార్తలపై ఆదాశర్మ స్పందిస్తూ నిజాలు తెలుసుకుని రాయాలని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి