బతుకమ్మ బాగుందా: సింధు తులానీ

Sridhar Cholleti

మంగళవారం, 10 జూన్ 2008 (13:48 IST)
WD
సింధు తులానీ ప్రధాన పాత్ర పోషించిన బతుకమ్మ ఇటీవల అన్ని కేంద్రాలలో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలంగాణా ప్రాంతమైన వరంగల్ లో పర్యటించింది. చిత్ర దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ... 'నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ బతుకమ్మ సినిమాను రూపొందించామ'న్నారు.

రచయిత, గాయకుడు అందెశ్రీ మాట్లాడుతూ... తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలే బతుకమ్మ సినిమా అన్నారు. పరకాల పట్టణంలో బతుకమ్మ చిత్ర యూనిట్ ప్రజలతోపాటు ఈ చిత్రాన్ని చూశారు. చిత్ర కథానాయిక సింధుతులానీ, 'బతుకమ్మ బాగుందా' అని తెలుగులో అడిగేసరికి సినిమాకు వచ్చిన ప్రేక్షకులంతా చాలా బావుంది అని సమాధానమిచ్చారు. తెలుగురాని సింధు తెలుగులో మాట్లాడటం తమకు ఎంతో ముచ్చటేసిందని కొందరు అన్నారు.

వెబ్దునియా పై చదవండి