కత్రినా కాదనుకుంటోందా...? సల్మాన్ వద్దనుకుంటున్నాడా...?

సల్మాన్ ఖాన్ ప్రేమాయణం ఎప్పుడూ సస్పెన్సే. సల్మాన్ లక్కో- బ్యాడ్ లక్కో కానీ అతను ప్రేమించిన అమ్మాయిలు వరుసగా అతనికి దూరమవుతూ వస్తున్నారు. తాజాగా కత్రినా కూడా "హ్యాండ్" ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

బాలీవుడ్ సినీజనం కత్రినా కైఫ్ "నైఫ్" లాంటిదనీ, నమ్మవద్దనీ సల్మాన్ చెవినిల్లు కట్టుకుని చెపుతున్నారట. దీనికి బలం చేకూర్చే విధంగా కత్రినా ప్రవర్తన కూడా ఉంటోంది. ఆమె తన పుట్టినరోజు వేడుకలను సల్మాన్ లేకుండా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తోందట.

సల్మాన్ లేకుండా పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే... అతనితో విభేదాలున్నాయా...? అని మీడియా గొడవ చేస్తుందేమోనని తన బర్త్ డే నాటికి లండన్‌కి చెక్కేసేటట్లు ప్రణాళిక రూపొందించుకున్నదట. ఇది తెలిసిన సల్మాన్ తోకతొక్కిన పాములా బుసలు కొడుతున్నాడని బాలీవుడ్ సినీ జనం అంటున్నారు.

కత్రినాపై కసితో ఆమె లేకుండానే సల్మాన్ తన స్వగృహంలో ఓ పార్టీని ఏర్పాటు చేశాడట. ఆ పార్టీకి కత్రినా కైఫ్‌ను పిలువలేదట. కత్రినా ఎందుకు రాలేదూ...? అని ఎవరైనా అడిగితే ఆమె సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నదని చెపుతున్నాడట.

ఇదంతా చూసిన బాలీవుడ్ సినీ జనంలో... సల్మాన్‌ను కత్రినా వద్దనుకుంటుందా...? లేక సల్మాన్ ఖానే కైఫ్‌ను కాదనుకుంటున్నాడా...? అనే సందేహాలను వెలిబుచ్చుతున్నారట.

వెబ్దునియా పై చదవండి