"మంగళ"గా వస్తోన్న "మంత్ర"..!?

"మంత్ర" వంటి హిట్ చిత్రాన్ని అందించిన తులసిరాం.. మళ్లీ ఛార్మి కాంబినేషన్‌లో మరో సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాడు. ఈ చిత్రానికి "మంగళ" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసిందే. ఇంకా జనవరి చివరిలో సెట్స్‌పైకి వస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 

"మంత్ర" తర్వాత మనోరమ, కావ్యాస్ డైరీ, 16 డేస్ వంటి చిత్రాల్లో నటించిన ఛార్మికి మంచి హిట్ లభించలేదు. కానీ మంగళ పేరుతో రానున్న ఈ చిత్రం తప్పకుండా ఛార్మికి మంచి పేరు సంపాదించిపెడుతుందని సినీ జనం అనుకుంటున్నారు.

"మంగళ"గా విభిన్న పాత్రలో ప్రేక్షకులను ముందుకు రానున్న ఛార్మి.. ఇందులో నటనాపరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకోనుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

"మంత్ర" తర్వాత ఈ బొద్దందాల ముద్దుగుమ్మ ఛార్మికి పలు అవకాశాలు వచ్చాయి. కానీ 2008లో ఛార్మికి ఓ హిట్‌కూడా లేకపోవడంతో.. వచ్చే ఏడాదైన మంత్రకు కలిసొస్తుందేమో చూడాలని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి