రుమేనియన్ టీవీ నటితో సల్మాన్ ఖాన్ రొమాన్స్... పెళ్లి చేస్కుంటాడా...?!!

గురువారం, 9 మే 2013 (13:05 IST)
FILE
ముదురు ప్రేమికుడు, బాలీవుడ్ దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఇక్కడి అమ్మాయిలతో అచ్చొచ్చినట్లు లేదు. అందుకనే ఏమోగానీ విదేశీ అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. తాజాగా బాంద్రాలో రొమేనియన్ టీవీ నటి లులియా వాంటుర్‌తో సల్మాన్ ఖాన్ తిరుగుతూ కనబడ్డాడట. ఆమెతో బాగా పొద్దుపోయే దాకా హోటళ్లలో గడుపుతున్నాడట. ఆరా తీస్తే వ్యవహారం గత రెండేళ్లుగా సాగుతూనే ఉన్నదట.

బాంద్రాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వీళ్లద్దరూ ఖచ్చితంగా కలుసుకుని తమ ఇష్టంవచ్చినంత సేపు అక్కడే ఎంజాయ్ చేయడాన్ని చాలామంది చూశారట కూడా. ఆమెనే పెళ్లి చేసుకుంటాడన్న పుకార్లు కూడా వినబడుతున్నాయి. ఇకపోతే సల్మాన్ ఖాన్ ఇంతకుముందు సోమీ అలీ, సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లతో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. మరి ఈ బాడీగార్డ్ రుమేనియా అమ్మాయితోనైనా నిలకడగా ప్రేమ సాగించి పెళ్లి దాకా తీసుకు వెళతాడో లేదో చూడాలి.

వెబ్దునియా పై చదవండి