30 దాటక ముందే పెళ్లి చేసుకుంటా: ఇలియానా

సగటు అమ్మాయి లాగానే తన మనసు కూడా పెళ్లి గురించి ఎన్నెన్నో కలలు కంటుందని అందాల ముద్దుగుమ్మ, కిక్ సుందరి ఇలియానా అంటోంది. సినిమా స్టార్ అయితే ఊహలు ఆకాశంలో ఉండవని, తనకు కాబోయేవాడు ఎలా ఉండాలని కలలు కంటున్నానని ఇలియానా చెబుతోంది. 

తనకు భర్తగా కాబోయే వ్యక్తి రొమాంటిక్‌గా ఉండాలని ఇలియానా మనసులోని మాటను బయటపెట్టింది. ఇంకా తన జీవిత భాగస్వామి గురించి ఇలియానా ఎలా ఉండాలంటుందంటే..? అందంగా లేకపోయినా తనతో అబద్ధాలు మాత్రం ఆడకూడదట.

అసత్యాలు పలికేవారంటే ఆమెకు అలర్జీ అట. ముప్ఫై దాటకుండానే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నదట.. ఇలా పలు విషయాలను చెప్పుకొచ్చింది.

ఇంకా ఏమంటుందంటే..? కొన్ని విషయాలు వయస్సులో ఉండగానే బాగుంటాయి. తనకు నచ్చినవాడినే పెళ్లాడుతాను. పిల్లల్ని కనడం, భర్తకు రుచిగా వండి పెట్టడంలో ఉన్న థ్రిల్‌ను ఓ సగటు మహిళగా అనుభవించాలి" అని ఎంతో ఆశపడుతున్నానని చెప్పింది.

ఇంకేముంది..? కాబోయే భర్త, జీవితంపై ఇలియానా కలలు త్వరలో ఫలించాలని మనం కూడా ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..?.

వెబ్దునియా పై చదవండి