త్వరలోనే తండ్రి కాబోతున్న ఆది పినిశెట్టి!

గురువారం, 17 నవంబరు 2022 (10:01 IST)
Adi pinishetty
దర్శకుడు, రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి త్వరలోనే తండ్రి కాబోతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆది పినిశెట్టి సతీమణి, హీరోయిన్ నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
తనతో రెండు సినిమాలు కలిసి నటించిన కన్నడ భామ నిక్కీ గల్రానీతో ప్రేమలో పడ్డారు.

వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో ఈ ఏడాది మే 18న చెన్నైలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. తాజాగా నిక్కీ గర్భం దాల్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు