wolf attack: తోడేళ్ల దాడి.. పంట పొలాల గుడిసెలో నిద్రిస్తున్న దంపతుల మృతి

సెల్వి

బుధవారం, 1 అక్టోబరు 2025 (13:25 IST)
Wolf
తోడేళ్ల దాడిలో ఒక వృద్ధ దంపతులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ కైసర్‌గంజ్ తహసీల్ పరిధిలోని మజ్రా తౌక్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన తోడేళ్ల దాడిలో ఒక వృద్ధ దంపతులు మృతి చెందారని అటవీ అధికారులు తెలిపారు. బాధితులు, ఖేడాన్, అతని భార్య మంకియా, ఇద్దరూ సుమారు 60 సంవత్సరాల వయస్సు గలవారని పోలీసులు తెలిపారు. దాడి జరిగినప్పుడు వారి ఇంటికి దూరంగా ఉన్న పొలంలో ఒక గుడిసెలో నిద్రిస్తున్నారని ప్రాంతీయ అటవీ అధికారి రామ్ సింగ్ యాదవ్ తెలిపారు. 
 
మంగళవారం ఉదయం గుడిసెలో వారి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. తోడేళ్ల దాడిలో వృద్ధ దంపతులు మరణించివుంటారని అనుమానిస్తున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రామ్ సింగ్ వెల్లడించారు. 
 
ఈ సంఘటన తర్వాత, గ్రామస్తులు ఆగ్రహంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఖేడాన్ భార్య అతనికి ఆహారం ఇచ్చిన తర్వాత ఆలస్యం కావడంతో అక్కడే వుండిపోయారని.. తన పంటలను కాపాడుకోవడానికి గుడిసెను ఉపయోగించారని గ్రామస్తులు తెలిపారు. 
 
మంగళవారం ఉదయం వారి కుమారుడు మృతదేహాలను కనుగొన్నాడు. మృతుల ఉదరభాగంలో తీవ్రంగా గాయమైనాయి. వారి చేతులు కనిపించలేదని స్థానికులు తెలిపారు. ఇది తోడేళ్ల దాడేనని.. సోమ, మంగళవారాల్లో తోడేళ్లు ఆ గ్రామస్థులపై దాడి చేశాయని స్థానికులు అంటున్నారు. ముగ్గురు ఈ ఘటనలో గాయపడ్డారని గ్రామస్తులు కూడా తెలిపారు. 
 
కైసర్‌గంజ్, మహసి తహసీల్‌లలో దాదాపు డజను గ్రామాల్లో జరిగిన హింసాత్మక తోడేళ్ల దాడుల్లో సెప్టెంబర్ 9 నుండి నలుగురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. చాలా దాడులు మజ్రా తౌక్లి, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలలో జరిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు