హైదరాబాద్ నగరంలోని మాదన్నపేటలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ తన భార్య, సోదరితో దాడి చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెంపుడు కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు ఎందుకు మలవిసర్జన చేయిస్తున్నారంటూ ఆ వృద్ధురాలు ప్రశ్నించడంతో ఈ దాడి జరిగింది.
తమ ఇంటి ముందు పెంపుడు కుక్కలను ఓ పోలీస్ కానిస్టేబుల్ మలవిసర్జన చేయిస్తున్నాడు. దీన్ని గమనించిన ఓ వృద్ధురాలు ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన పోలీస్ కానిస్టేబుల్ తన భార్య, సోదిరిని పిలిచి వృద్ధురాలిపై దాడి చేయించాడు. 60 యేళ్ళ వృద్ధురాలి అని కూడా చూడకుండా ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ, కర్రతో కానిస్టేబుల్ కుటుంబం దాడి చేసింది. ఈ దాడిలో ఆ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు జరుపుతున్నారు.