మంజు వారియర్‌తో విడాకులకు, ప్రస్తుత తన భార్య కావ్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను చాలా మందిని నమ్మి, మోసపోయానని చెప్పుకొచ్చాడు. అలా మోసపోయిన ప్రతిసారి మౌనంగా ఉండేవాడినని, అందుకు కారణం తన కుమార్తె భవిష్యత్తు గురించిన ఆలోచనలేనని (తన మాజీ భార్య కూతురు) తెలిపాడు.
అయితే, ఇప్పుడు తన మాజీ భార్య తన జీవితాన్ని సంతోషంగా సాగిస్తోందని, అదేవిధంగా తాను కూడా తన జీవితాన్ని భార్య కావ్యతో కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి తామిద్దరం ఎవరిదారుల్లో వారు ప్రయాణిస్తున్నామని దిలీప్ తెలిపాడు.