తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాలను వివరిస్తూ... 'టెన్త్ క్లాస్ బాగా చదివేప్పటికి నా కళ్లు నెత్తిమీదకు వచ్చాయి. అంటే మా బ్యాచ్‌లో నేను ఫస్ట్ క్లాస్ అన్నమాట. అప్పట్లో చదివేదాన్ని. దానికి మించి అల్లరి చేసే దాన్ని. హైస్కూల్ వరకు నేనెప్పుడూ బంక్ కొట్టలేదు. ఇంటర్ ఫస్టియర్‌లో కళ్లు నెత్తికెక్కేశాయి. ఆ రోజుల్లో ‘నువ్వే కావాలి’ సినిమా విడుదలైంది. యూత్‌లో ఆ సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది.
దీంతో ఎలాగైనా ఆ చిత్రాన్ని చూడాలని ఫిక్సయిపోయాం. ఒక రోజు కాలేజీకి బంక్‌కొట్టి, కొంచెం ఎక్కువ దూరంలో ఉన్న సినిమా హాల్‌కు ఎవరూ చూడరనే ధైర్యంతో ఫ్రెండ్స్‌తో కలసి వెళ్లాను. నేను ఇంటికి వచ్చే లోపలే ఆ న్యూస్ లీకైపోయింది. దాంతో మావాళ్లు నన్ను చితక్కొట్టేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కాలేజీకి బంక్‌కొట్టి సినిమాకు గానీ, షికారుకు గానీ వెళ్లలేదు. ఆ రోజులు తలచుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో!' అని చెప్పుకొచ్చింది.