తనపై విలేకరులు రాస్తున్న గాసిప్స్‌పై హీరోయిన్ నయనతార మండిపడుతున్నారు. ఈ గాసిప్స్‌ను తన అత్తింటివారు నమ్మితే, తన పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఈ కథనాలు రాస్తున్నవారు గుర్తించాలని... ఇంత చిన్న లాజిక్‌ను వారు ఎలా మర్చిపోతారో అంటూ మండిపడింది.
ఇటీవలికాలంలో నయనతారపై అనేక రకాల గాసిప్స్ వస్తున్నాయి. వీటిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకుంటూ పోతున్నారని... కానీ, తన మనసులో ఏముందో మాత్రం ఎవరూ చూడలేరని అంది. నటించడానికే తాను సినిమాల్లోకి వచ్చానని... మంచి కథ వస్తేనే చేస్తానంటూ మడిగట్టుకుని కూర్చుంటే... ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోతాయని చెప్పింది.
తన ప్రేమ, పెళ్లి గురించి కూడా చాలా వార్తలు వస్తున్నాయని... వాటిని తన కుటుంబసభ్యులు నమ్మరని నయన్ తెలిపింది. తనకు తన కుటుంబసభ్యులు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారని... అలాంటిది ఇలాంటి పుకార్లను వారు ఎలా నమ్ముతారని ప్రశ్నించింది.