లండన్ బ్యూటీ కత్రినా కైఫ్‌తో విడిపోయిన తర్వాత బాలీవుడ్ లవర్ బోయ్ రణ్‌బీర్ కపూర్ శ్రీలంక బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరూ జంటగా రాయ్ చిత్రంలో నటించారు. కత్రీనాతో విడిపోయిన తర్వాత రణ్‌బీర్ ఈ అమ్మడితోనే క్లోజ్‌గా ఉంటున్నాడని, ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని పార్టీలు, పబ్బులకి తిరుగుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయమై రణ్‌బీర్ స్పందించాడు. కొత్త సినిమా 'యే దిల్ హై ముష్కిల్' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రియాల్టీ షోకు హాజరైన ఈ హీరో జాక్వెలీన్‌తో ఉన్న సంబంధం గురించి చెప్పండి అని యాంకర్ మనీశ్ పాల్ అడిగారు. దీంతో ఒన్ సైడ్ లవ్ గురించే కాక, తన రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ గురించీ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
''వన్ సైడ్ ప్రేమకి ఉన్న పవరే వేరు. మిగతా సంబంధాల్లా ఇద్దరి మధ్య విడిపోవడం అనేది ఉండదు. అలాగే జాక్వెలీన్‌పై కేవలం నాకు మాత్రమే హక్కు ఉంది'' అంటూ కామెంట్ చేశాడు రణ్‌బీర్. కపూర్స్ వారి అబ్బాయి సినిమా లెవల్‌లో ఈ డైలాగ్ ప్రస్తుతం ఇది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జాక్వెలీన్‌పై ఏకంగా తనకే హక్కు ఉందడనడంతో వ్యవహారం కాస్త ముదిరిందని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, రణ్‌బీర్ విదేశీ అమ్మాయిలపైనే మొగ్గు చూపడం కూడా ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై కత్రీనా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.