చిన్నబడ్జెట్‌తో రూపొందిన ''పెళ్లి చూపులు'' చిత్రం బాక్సాఫీసు బద్దలు కొట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలను, విమర్శకుల అందుకుంది. ఈ చిత్రంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో తరుణ్‌తో సినిమా చేయాలని టాప్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో అఖిల్ కూడా చేరిపోయాడు. అఖిల్‌కి ''పెళ్లిచూపులు'' చిత్రం బాగా నచ్చిందట.
''ఈ మధ్య నాకు బాగా కనెక్ట్ అయిన సినిమా ఇదేనని'' అఖిల్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ నాకు ముందే తెలుసు. తన షార్ట్ ఫిల్మ్స్‌ని చూసి ఓసారి పిలిపించా. ''నాకు తగిన కథ ఉంటే చెప్పు'' అని అడిగా. కానీ ''నాకు తగిన కథ తనదగ్గర లేదని'' అన్నాడు. తనతో సినిమా చేయడానికి ఇప్పటికీ సిద్ధమే'' అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు అఖిల్. అఖిల్ తన రెండో చిత్రానికి తగిన దర్శకుడి కోసం వెతుకుతున్నాడు. మరి తరుణ్ కరుణిస్తే... అఖిల్ ఖాతాలో హిట్ చేరిపోయినట్టే.