నో చెప్పడానికి సంకోచిస్తారు. కానీ సాయి పల్లవి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కెరీర్‌లో సాయిపల్లవి నటించిన సినిమాల కంటే సాయిపల్లవి వదిలేసిన సినిమాల లిస్ట్ పెద్దది. చిరంజీవి, అజిత్, విజయ్ దేవరకొండతో పాటు చాలా మంది హీరోల సినిమాలను సాయి పల్లవి తిరస్కరించింది. ఆమె తిరస్కరించిన సినిమాలు ఏంటి? అనేదానిని పరిశీలిస్తే..
చంద్రముఖి 2: లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన హారర్ మూవీ చంద్రముఖి 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్ చంద్రముఖికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని దర్శకుడు పి.వాసు మొదట భావించారు.
ఇవి కాకుండా అజిత్ వలిమై, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, విజయ్ లియో సినిమాల్లో హీరోయిన్‌గా సాయి పల్లవి పేరు వినిపించింది. కానీ ఈ సినిమాల్లో ఆమె నటించలేదు.