పవన్ కల్యాణ్ గ్లామర్ రహస్యం.. ఉసిరికాయ.. నీమ్ సికాయి జ్యూస్: అల్లు శిరీష్ ట్వీట్

శనివారం, 3 సెప్టెంబరు 2016 (13:12 IST)
మెగా ఫ్యామిలీ నుండి వచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేక ట్రెండ్ సెట్ చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలో తన మార్క్ అభిమానులను సంపాదించుకోగలిగాడు. పవన్ ఎంత పెద్ద హీరోనో అంతకు మించి మాములు మనుషి. ప్రజల కోసం ఎంతగా పాటు పడుతాడో అందరికీ తెలిసిందే. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో పవన్ ఎపుడు కూడా ముందుంటారు. క్యాన్స్‌ర్‌తో పోరాటం చేసిన శ్రీజాను హాస్పిటల్‌లో కలిసి పరామర్శించడం దగ్గర నుంచి.. హూదూద్, చెన్నై వరదలు తదితర విషయాల వరకు పవన్ ముందు ఉండి సహాయం చేసిన విషయం తెలిసిందే. 
 
అభిమాన గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయే పవన్ గురించి ఇప్పటివరకు చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను అల్లు శిరీష్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకి తెలియజేశాడు. పవన్ కల్యాణ్ గ్లామర్‌ను గురించి అల్లు శిరీష్ కొన్ని విషయాలను చెప్పాడు. పవన్ కల్యాణ్ ఆయుర్వేదానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తాడనీ .. ఎక్కువగా ఉసిరికాయలు తింటాడని అన్నాడు. అంతేకాదు నీమ్ సికాయి జ్యూస్‌ని పవన్ తెగ వాడతాడు అని చెప్పాడు. సాధ్యమైనంత వరకూ మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నిస్తాడని చెప్పాడు. క్రమం తప్పకుండా అష్టాంగ యోగా చేస్తాడనీ...అందుకే ఆయన బాడీ ప్లెక్స్ బుల్‌గా ఉంటుందని... అదే ఆయన గ్లామర్ రహస్యమని చెప్పుకొచ్చాడు. 
 
ఇక మానవతా వాదిగా పవన్ గొప్పతనం గురించి  మాట్లాడుతూ తనకు 2007లో ఒక పెద్ద కారు యాక్సిడెంట్ జరిగి తాను కొన్ని రోజులు ఒక ప్రముఖ హాస్పిటల్ లోని ఇంటేన్సీవ్ కేర్ యూనిట్‌లో ఉన్నప్పుడు పవన్ తన దగ్గరకు ప్రతిరోజు రావడమే కాకుండా అప్పటి తన పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న సందర్భాన్ని తను జీవితంలో మరిచిపోలేను అంటూ పవన్‌లోని మానవతా కోణాన్ని బయట పెట్టాడు శిరీష్. 

వెబ్దునియా పై చదవండి