గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

ఠాగూర్

బుధవారం, 23 జులై 2025 (08:56 IST)
వైకాపా మహిళా నేత, మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజా మరోమారు తన నోటికి పని చెప్పారు. గత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె ఇపుడు మళ్లీ పని చెప్పారు. ఈ నెల ఆరో తేదీన చిత్తూరు జిల్లా నగరిలోని వైకాపా కార్యాలయంలో జరిగిన రీకాల్ చంద్రబాబు అనే కార్యక్రమంలో ఆమె పాల్గొని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. 
 
రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలు అయ్యారు. టీడీపీ, జనసేన పార్టీ నేతలు తెలుసుకోవాలి. ఇపుడు హైదరాబాద్‌కు పారిపోతున్నారు.. రేపు జగనన్న ప్రభుత్వం ఏర్పాటైతే హైదరాబాద్‌కు కాదు.. అమెరికాకు పారిపోవాల్సి వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. 
 
ఆరోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ ఉండరు. వీళ్లను నమ్ముకుని వైకాపా నాయకులను టార్చర్ పెట్టినా, కేసులు పెట్టినా, కొట్టినా.. దానికి వందరెట్లు వడ్డీతో తిరిగి చెల్లిస్తాం అంటూ బహిరంగంగా హెచ్చరించారు. ఆమె వ్యాఖ్యల వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 
 
ఇకపోతే, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌‍ను ఉద్దేశించి మాట్లాడుతూ, 'ఆయనకు పిచ్చి బాగా ముదిరింది. ఎక్కడకు వెళ్తే అక్కడే పుట్టానంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చివరికి తమిళనాడు వెళ్లినా అక్కడే పుట్టానని చెబుతున్నాడు' అని రోజా వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు