నిజానికి అమలాపాల్ తమిళ దర్శకుడు విజయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయంతెల్సిందే. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించేందుకు భర్త అంగీకరించలేదు. కానీ, అమలాపాల్ మాత్రం అందుకు సమ్మతించకుండా, తమిళ హీరో ధనుష్ చిత్రంలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది వారి కాపురంలో చిచ్చుపెట్టింది.
ధనుష్ చిత్రం కోసం తన కాపురాన్ని కూడా ఫణంగా పెట్టిన అమలకు అనుకోని రీతిలో ఎదురు దెబ్బ తగిలినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఏ సినిమా కోసమైతే భర్తనూ, కాపురాన్నీ కాలదన్నుకుందో ఆ సినిమా నుంచి అమలను తప్పించారన్న వార్త బాగా హల్‌చల్ చేస్తోంది.
అమల విషయంలో జరుగుతున్న గొడవలు చూసిన యూనిట్ ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవాలని నిర్ణయించుకుందట! ఈ సినిమాలో అమలను కొనసాగిస్తే దాని ఫలితం సినిమా సక్సెస్ మీద పడుతుందేమోనన్న భయంతో చిత్రం యూనిట్ ఈ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. యూనిట్ నిర్ణయం తెలుసుకున్న అమలకు దిమ్మతిరిగి పోయిందట. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.